NTV Telugu Site icon

Minister Seethakka: నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు లేకపోయినా, ఒత్తిడి తట్టుకుని పనిచేసిన డిపిఓలను అభినందించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకే దక్కిందని, అందుకే ఈ ఉద్యోగాన్ని కేవలం పనిగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని ఆమె తెలిపారు.

Also Read: OYO: పెళ్లికాని జంటలకు ఓయో బిగ్ షాక్.. కొత్త రూల్స్తో వారికి చెక్

అధికారులు సిబ్బందితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ, పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించి, పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. నా శాఖను నేను నా కుటుంబంగా భావిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ మన అందరిదీ. మీరూ దీన్ని కుటుంబంగా భావించి పని చేయండని మంత్రి సీతక్క అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు సఫాయి కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్ల పాత్ర ఎంతో ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో వీరి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో, ఇకపై ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ ద్వారా కాకుండా కమిషనర్ కార్యాలయం నుంచే జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

Also Read: K Laxman: కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ ఫైర్

వేసవిలో తాగునీటి సమస్యల నివారణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. మనం సరఫరా చేసే తాగు నీటిపై ప్రజల్లో నమ్మకం కల్పించడమే లక్ష్యమని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కోయ జాతికి చెందిన నేను కాంగ్రెస్ ఇచ్చిన అవకాశంతో మంత్రి పదవి చేపట్టానని సీతక్క గుర్తుచేశారు. కింది వర్గాల సామర్థ్యంపై ఉన్న దురాభిప్రాయాలను తమ పనితీరుతో తప్పనిసరిగా నిరూపించాలని మంత్రి అన్నారు.

Show comments