NTV Telugu Site icon

Minister Seethakka: 3410 గ్రామాల్లో గ్రామసభలు.. 142 ఊళ్లలో గొడవలు చేసింది వాళ్లే..

Minister Seethakka

Minister Seethakka

నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. చిట్ చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. “కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది.. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారు. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుంది. పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు.. గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చేవి. ఫామ్ హౌస్ లో, ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ మా ప్రజా ప్రభుత్వంలో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలని టిఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఓట్లప్పుడే పథకాలు అరకొరగా ఇచ్చేవారు. కానీ ప్రజా అవసరాలు, ఆర్థిక వనరుల ను బట్టి పథకాలను అమలు చేస్తున్నాం. పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే ఉద్దేశ పూర్వకంగా బీఆర్‌ఎస్ గొడవలు చేస్తుంది.” అని మంత్రి  బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

READ MORE: Hanshita Reddy: దిల్ రాజు కుమార్తె ఇంట ముగిసిన ఐటీ సోదాలు

కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు ఆర్థిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటిటి సర్వేలో పాల్గొనలేదని మంత్రి సీతక్క తెలిపారు. “ఇప్పుడు వాళ్ళకి పథకాలు రావనే ఆందోళన ఉంది. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాం. గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నాం. బీఆర్ఎస్ చేత కాని వల్లే సమస్యలు వస్తున్నాయి. పది సంవత్సరాల్లో అన్ని సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు? వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతు బంధు ఇచ్చారు. కానీ లెక్కల కష్టాన్ని నమ్ముకున్నా కూలీలకు ఎలాంటి సహాయం చేయలేదు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తాము. బీఆర్ఎస్ హయాంలో అద్భుతాలు ఏమి జరగలేదు. బెలూన్ లాగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకే సారి అమాంతం పైకి రాలేదు. బీఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదా?” అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

READ MORE: IND vs ENG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. సుర్యకుమార్ వ్యూహం ఇదే..

ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి, ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి.. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ బాటలు వేసిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. “మంచి నీ తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం టిఆర్ఎస్ కు అలవాటు. సీఎం వచ్చాక బీసీ కమిషన్ రిపోర్ట్ ఆమోదం అవుతుంది.. రిపోర్ట్ దాదాపుగా పూర్తి అయింది. సర్పంచ్ ఎన్నికల త్వరగా నిర్వహిస్తాం. కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి. స్కీమ్ లకు అప్లికేషన్లు నిరంతర ప్రక్రియ. పాలన చేత గాదు అని మా మీద విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రం లో కాంగ్రెస్ పాలించ లేదా? పదవులు మీద మీకు ఆకాంక్ష .. ప్రజలు మీద లేదు. కేటీఆర్ అందరికి రైతు బంధు ఇవ్వాలని అంటున్నారు.
500 ఎకరాలు ఉన్నోళ్లు కు రైతు బంధు ఇవొద్దు అని మా ప్రభుత్వం అనుకుంటుంది. గ్రామ సభ లో ప్రదర్శించే జాబితా మీద ప్రజల అభిప్రాయాలు తీసుకుని లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. నిజమైన పేద వారికి పథకాలు అందాలి.. అర్హుల లో పార్టీ లు చూడటం లేదు.. చాలా కాలం నుండి రేషన్ కార్డ్ లు లేవు.. అందుకే ప్రజల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ.. అర్హులందరికీ అందే వరకు కొనసాగుతూనే ఉంటాయి.” అని మంత్రి తెలిపారు.