Harish Rao : ప్రభుత్వ ఫెయిల్యూర్‌కు ఇదే నిదర్శనమని, జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసిందన్నారు. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస…
Grama Sabha: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాల్గవరోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప్ప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,861 గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది మొత్తం లక్ష్యంలోని 85.96 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో 3,130 గ్రామ సభలు, 856 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమాలు గ్రామస్థుల సమస్యలపై చర్చించేందుకు, స్థానిక అవసరాలు గుర్తించేందుకు దోహదపడనున్నాయి. Also Read: Fire Accident:…
నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. చిట్ చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. "కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది.. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారు. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుంది.