Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అందులో భాగంగా అంగన్వాడీ టీచర్ల నుంచి నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సమస్యలను తక్షణమే గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్లు, ఆయాలకు అందించే నూతన యూనిఫామ్‌లను పరిశీలించి, అక్టోబర్ మొదటి వారంలోగా వాటిని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం 17 ఉన్న శిశు దత్తత కేంద్రాలను విస్తరించి ప్రతి జిల్లాలోనూ ఒక అడాప్షన్ సెంటర్ ఉండేలా చూడాలన్నారు.
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే 16 జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చామని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో కలెక్టర్లతో మాట్లాడి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీల్లో పిల్లలకు అందుతున్న పోషకాహారం, వారి ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించి నివేదిక అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ నిధులు ల్యాప్స్ కాకుండా పూర్తి స్థాయిలో వినియోగించాలని అధికారులకు నిర్దేశించారు.
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!