Minister Seethakka : రాహుల్ గాంధీ నిజమైన యోధుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి దగ్గరలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆగిపోవడంపై ఆ పార్టీ నేత, తెలంగాణ మంత్రి సీతక్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీడియా కళ్లకు గంతలు కట్టుకుందని, దేశంలో వాస్తవంగా జరుగుతున్నదేంటో నిజంగా చూపించి ఉంటే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి ఉండేదని అన్నారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఓ యోధుడని కొనియాడారు. అహంకారంతో వ్యవహరించే షెహన్‌షా(రాజు)ను మోకాళ్లపై కూర్చోబెట్టారని మోదీని ఉద్దేశించి ఎక్స్‌లో పేర్కొన్నారు. తామంతా రాహుల్ వెంటే ఉన్నామని తెలిపారు. దేశం కోసం పోరాటం కొనసాగిద్దామని సీతక్క పేర్కొన్నారు.
Chandrababu: ప్రజా తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దు.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
Also Read
- Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
- Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్‌లకు మమత సందేశం
ఇదిలా ఉంటే.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా భవన్ లో ఆమె మొక్కలను నాటారు. జీవించడానికి పర్యావరణం చాలా ముఖ్యమైనదని చెప్పారు. వాతావరణం బాగుండాలంటే చెట్లు నాటాలని సూచించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను నివారించడానికి చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలు నాటుతూ పర్యావరణంలో భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన కర్తవ్యమని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలునాటి పాఠశాల వాతావరణంలో పచ్చదనాన్ని నెలకొల్పాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకువస్తుంది..?
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్‌తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్‌లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..