Minister Seethakka : హైదరాబాద్ గాంధీ భవన్‌లో బుధవారం మంత్రి సీతక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినడం, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరై తమ వినతులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల వినతులను స్వీకరించడంతో పాటు, కొన్నింటిని సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సంకల్పం నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Tollywood : రానా నాయుడు డైరెక్టర్ కు టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం చేపట్టి, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతోంది. అదే విధంగా గాంధీభవన్‌లో కూడా ప్రజా వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులకు సూచించారు. ఈ నిర్ణయానికి మంత్రులు సానుకూలంగా స్పందించడంతో ప్రతివారం రెండు రోజుల పాటు ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు అంగీకరించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి సీతక్క తెలిపారు.
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి ఫైర్