Minister Satya Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇంకా సమయం ఇవ్వాలి అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. నిరంతరం 20 గంటలు కష్టపడే నాయకత్వం కేంద్రం, రాష్ట్రంలో ఉందన్న ఆయన.. ఏపీ మరల అభివృద్ధికి చిరునామాగా మారిపోతుంది త్వరలో అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఎమర్జెన్సీ నాటి యదార్ధ సంఘటనలపై బీజేపీ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 39, ఆర్టికల్ 42లు అత్యంత దారుణం అన్నారు.. సావరిన్ సెక్యులర్ రిపబ్లిక్ అని ప్రియాంబుల్ ను మార్చారు కాంగ్రెస్ వారు… ఇవాళ రాజ్యాంగం మారుస్తారంటూ దారుణంగా మాట్లాడుతున్నారు. సుద్దపూసల్లాగా వాళ్ళంతా మోడీపై వ్యాఖ్యలు చేస్తున్నారు.. గత ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది. ప్రజలకు రావాల్సిన సౌలభ్యాలు అడ్డుకోవచ్చని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకోవచ్చని ఒక వ్యక్తి నిరూపించాడు.. ఆనాడు ఇందిరాగాంధీని గద్దె దించినట్టుగా ఓటు ద్వారా మే 13న ఈ రాష్ట్రంలో ఒక ఓ(వే)టు వేశారని వ్యాఖ్యానించారు.
Read Also: Minister Sridhar Babu: ఆ భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలి.. కేంద్ర మంత్రిని కోరిన శ్రీధర్ బాబు
ఇక, ఆర్టికల్ 356 విధించి కుటుంబ పాలన కొనసాగించింది కాంగ్రెస్.. కానీ, వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదు అన్నారు సత్యకుమార్.. విద్యార్ధి దశ నుంచి పని చేస్తూ ఉన్న వారు ప్రజలచే ఎన్నుకోబడ్డారు.. వసుంధర రాజే, రాజ్‌నాథ్ సింగ్ ల వారసులు రాజకీయాల్లోకి రాలేదే..? అని ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కారణంగా అవకాశాలు ఇవాళ వచ్చాయన్నారు. ఆరు లక్షల మందికి రాజశేఖరరెడ్డి కాలంలో బలవంతపు కుటుంబ నియంత్రణ చేసారు.. పురోగమన ఆంధ్రప్రదేశ్ కాస్తా తిరోగమనంలోకి వెళ్ళి.. అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎవరైనా రాజకీయ బహిష్కరణ విధించాలి.. రాజకీయ భవిష్యత్తు లేకుండా సమాధి చేయాలని పిలుపునిచ్చారు.. ఆరోగ్యశాఖ లోనే 6వేల కోట్ల బకాయిలు గత ప్రభుత్వానివి ఉన్నాయి.. నేషనల్ హెల్త్ మిషన్, ఎన్ఆర్ఈజీఎస్, ఆయుష్మాన్ భారత్ నిధులు మళ్లించారని విమర్శించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.