NTV Telugu Site icon

Sabitha Indra Reddy : అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగిస్తాము

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

తెలంగాణలో వరుసగా పరీక్షపత్రాల లీకుల ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ ఘటనను మరవకముందే.. పదో తరగతి పరీక్షా పత్రాలు లీకవుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. నేడు బీఆర్కే భవన్‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పేపర్ లీకేజీల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న తాండూర్ లో తెలుగు పేపర్, ఈ రోజు వరంగల్ కమలాపుర్ మండలంలో హిందీ పేపర్ లీకైన ఘటనపై ఆరా తీశారు. రెండు చోట్లా పరీక్ష ప్రారంభం అయ్యాక బయటకు రావడంపై ఇప్పటికే పోలీస్ విభాగం, విద్యాశాఖ విచారణ చేపట్టాయి. అయితే.. వరంగల్ ఘటనపై ప్రాధమిక నివేదికను తెప్పించుకున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అయితే.. ఇది లీకేజీ కాదని ఇప్పటికే పేర్కొన్నారు వరంగల్ సీపీ రంగనాథ్.

Also Read : Cruel Father: ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య.. అడ్డొచ్చిన భార్య, కోడలిపై..

అయితే.. రేపటి నుంచి ఇంకా నాలుగు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రశ్నే లేదన్నారు. ఎక్కడ పేపర్ లీక్ కాలేదన్నారు. అదే సమయంలో.. వీడియో కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ అధికారులపై మంత్రి సబితా సీరియస్‌ అయ్యారు. నేను సీరియస్ గా ఉంటే ఉద్యోగాలు పోతాయని మంత్రి హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం బీఆర్కే భవన్‌ నుంచి వెళుతున్నా సమయంలో.. పదవ తరగతి పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థినిలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముచ్చటించారు. మహేశ్వరం నియోజకవర్గము మీర్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరై బయటకు వస్తున్న విద్యార్థినిలను చూసి కాన్వాయ్ ఆపి కారు దిగి వారితో మాట్లాడారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరీక్షలు ఎలా రాసారు అని ప్రశ్నించగా బాగా రాసామని విద్యార్థినీలు బదులు ఇచ్చారు. బాగా కష్టపడి చదివి రాయాలని మంత్రి ప్రోత్సహించారు.

Also Read : Ajit Pawar: ప్రజలు డిగ్రీ ఆధారంగా మోడీకి ఓటేశారా?