తిరుపతి జిల్లాలోని నగిరి లో తన వ్యతిరేకవర్గం నేతలపై తీవ్ర స్ధాయిలో మంత్రి రోజా ఫైర్ అయ్యారు. జగనన్న ముద్దు రోజమ్మ వద్దు అంటూ ప్రతిరోజు 500 కట్టి ప్రెస్ క్లబ్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. మీరు పార్టీలో ఉండడం వల్లే నగరిలో 500 ఓట్లు మెజార్టీ వస్తున్నాయని, మీరు పార్టీ నుండి బయటకు వెలితే నగరిలో 30,40 వేల మెజారిటీ గెలుస్తా అని ఆమె వ్యాఖ్యానించారు. నా వాళ్ళు మాట్లాడితే మీరుతట్టుకోలేగలరా..బతకగలరా అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
Haiti Prime Minister: హైతీ ప్రధాని రాజీనామా.. ఎందుకో తెలుసా..?
నగరిలో మాట్లాడడానికి మొహం లేక తిరుపతి లో కూర్చొని నగిరి పేరు ప్రతిష్ట దిగజారుస్తున్నారని, మనందరినీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆమె అన్నారు. వారందరికి బుద్దీ చెప్పే సమయం వచ్చిందని, నగరిని ఎవరు చేయని విదంగా అభివృద్ధి చేశానని మంత్ర రోజా తెలిపారు. నగరిలో ప్రతిపక్షాలతో పాటు మన పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ములు గుద్ది ఉంటున్న వెన్నుపోటు దారులతో పోరాటం చేస్తున్నానని, వారితో పోరాడుతూ.. ఇంకోపక్క ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిని అందిస్తున్నానని ఆమె వెల్లడించారు. జగనన్న ఏ విధంగా ప్రతిపక్షాలతో పోరాడుతూ ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయిస్తున్నారో నేను అలానే చేస్తున్నా అని ఆమె పేర్కొన్నారు.