Minister RK Roja: రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్ లకు గురువు చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఎలా దొచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్టా అని అభివర్ణించారు. సినిమాల్లో కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబుకు పేరు ఉంటే.. దోచుకోవడంలో కలెక్షన్ కింగ్ గా చంద్రబాబు ఉన్నాడని దుయ్యబట్టారు. అయితే, చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై టీడీపీ నేతలు ఎందుకు నోరువిప్పరు? అని నిలదీశారు. చంద్రబాబు, లోకెష్ అవినీతి అక్రమాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో వేల కోట్ల అక్రమ ఆస్తులు భయపడ్డాయని విమర్శించారు. ఇక, త్వరలో తెలంగాణ నుండి కేసీఆర్ కూడా చంద్రబాబు తరిమెస్తాడని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: Dog skateboarding: స్కేటింగ్ చేస్తున్న కుక్క .. మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేసిందంటే?
ఇక, ప్రతిరోజూ కూడా గురువులను పూజించాలని సూచించారు రోజా.. భగవంతుడుతో సమానంగా మనం గౌరవించేది గురువును మాత్రమే.. ప్రతిఒక్కరు గౌరవించేది… గౌరవించాల్సింది ఉపాధ్యాయుడినే.. దేశంలో ఎక్కడ లేనివిధంగా పాఠశాలను అభివృద్ధి చేయడానికి నాడు నేడు కార్యక్రమం చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. ఒకప్పుడు నారాయణ, చైతన్య స్కూళ్లలో చదవడానికి సీటు దొరికేది కాదు.. ఇప్పుడు ఆ పరిస్థితికి ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మార్కులు సాధించారని గుర్తు చేశారు మంత్రి ఆర్కే రోజా.