Minister RK Roja: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి రోజా హాట్ కామెంట్లు.. భువనేశ్వరి, బ్రహ్మణిపై గౌరవం పోతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: చంద్రబాబు, లోకేష్‌తో పాటు భువనేశ్వరి, బ్రహ్మణిపై కూడా సంచలన వ్యాఖ్యలుచేశారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తిరుగుతున్నారు.. కానీ, అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.. ప్రధాని మోడీ , అమిత్ షా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు స్కిల్ డెవెలప్‌మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని ఆరోపించారు మంత్రి రోజా.. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ పేరుతో దోచుకున్నారు.. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు.. స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు అని విమర్శించారు. కాళ్ల నుండి కళ్ల వరకూ భయంతో లోకేష్ వణికిపోతున్నాడు.. ఎర్రబుక్ లో రసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు చేసుకోవాలన్నారు. హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితేనే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు.. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా? అని ప్రశ్నించారు.
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు.. అక్కడి నుండి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది? అని నిలదీశారు మంత్రి రోజా.. హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు రూ.600 కోట్లుగా పేర్కొన్న ఆమె.. భువనేశ్వరి, లోకేష్ 118 కోట్ల రూపాయల నోటీసులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కాంలను తెల్సుకోవాలని సూచించారు. ఇక, భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందన్నారు. చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని హాట్ కామెంట్లు చేశారు మంత్రి ఆర్కే రోజా.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!