Minister RK Roja: కళాకారులకు అండగా నిలబడాలని సీఎం జగన్ భావించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు. అనంతరం కళాకారులతో కలిసి మంత్రి రోజా డప్పు వాయించారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి రోజా వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు న్యాయం జరగలేదన్నారు. కళాకారులు గుర్తింపు కోసం తాపత్రయ పడతారని.. కళాకారులకు అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి భావించారని మంత్రి తెలిపారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని.. సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించామన్నారు. ధైర్యంగా మేం కార్డుల ప్రదానోత్సవం చేయగలుగుతున్నామన్నారు.
Read Also: Chandrababu Helicopter: చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం..! రాంగ్ రూట్‌లోకి వెళ్లి..!
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. మారుమూల కళాకారులను సైతం గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందజేస్తున్నామన్నారు. గతంలో కళాకారులను ఎవరూ పట్టించుకోలేదని.. జగనన్న మాత్రమే కళాకారులను పట్టించుకున్నారన్నారు. కళాకారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్నికల సమయంలో దొంగలంతా ఒకటవుతున్నారని.. పందుల్లా గుంపులుగా వస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. దొంగలకు, ఆ పందులకు బుద్ధి చెప్పాలంటే కళాకారుల ఆట…మాట..పాట కావాలన్నారు. ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024) …జగనన్న వన్స్ మోర్ అంటూ మంత్రి రోజా నినాదం చేశారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి పోయాడని.. జనాన్ని దోచుకుని హైదరాబాద్‌లో ఆస్తులు దాచుకున్నాడని మంత్రి రోజా విమర్శించారు. మళ్లీ ఆ దొంగలొస్తే ప్రజలకు విద్య,వైద్యం,కళాకారులకు అన్నం దొరకదన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి విషం చిమ్మి పోతున్నారని.. నాన్ లోకల్ పొలిటీషయన్ల గురించి పట్టించుకోవద్దని మంత్రి రోజా అన్నారు.
తాజావార్తలు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!