RK Roja: వైసీపీ రెబల్స్‌పై మంత్రి రోజా ఫైర్‌..

Roja

Roja

RK Roja: మంత్రి ఆర్కే రోజా.. మరోసారి నగరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోని రెబల్స్‌ ఆమెకు తలనొప్పిగా మారారు.. అయితే, రెబల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారన్న ఆమె.. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అన్నారు. కానీ, జగనన్న బాగుంటేనే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయని సూచించారు.

Read Also: Rain forecast: బెంగళూరు ప్రజలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ..

మరోవైపు.. నగరిలో తన వ్యతిరేక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా.. నగిరి నియోజకవర్గంలో అన్ని పదవులు అనుభవించి.. క్వారీల్లో అక్రమంగా సంపాదించుకొని.. నన్ను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.. ఇక, నన్ను ఓడించడానికి ఒక్కటై.. నగరి టీడీపీ అభ్యర్ది గాలి భాను ప్రకాష్ ను గెలిపించడానికి తిరుగుతున్నారని దుయ్యబట్టారు.. వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పండి.. మీకు మంచి చేసినా నన్ను గెలిపించాలని నగరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి ఆర్కే రోజా. కాగా, నగరిలో మంత్రి రోజా ఓ వైపు.. ఆమె భర్త.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. మరోసారి విజయం సాధించి.. తన వ్యతిరేక వర్గానికి చెక్‌ పెడతాననే నమ్మకంతో ఉన్నారు. కాగా, పార్టీలో ఉంటూ.. తనకు వ్యతిరేకంగా ప్రెస్‌ పెట్టిన నేతలపై పార్టీకి ఫిర్యాదు చేసిన మంత్రి రోజా.. వారిపై చర్యలు తీసుకునేలా చేసిన విషయం విదితమే.