Site icon NTV Telugu

Minister RK Roja: చంద్రబాబుకు రెస్ట్‌..! భువనేశ్వరి తన మనసులోని మాటను బయటపెట్టారు..

Roja

Roja

Minister RK Roja: నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెంది నేతలు.. కుప్పంలో నారా చంద్రబాబునాయుడు పని అయిపోయిందని భువనేశ్వరి మాటలు బట్టి అర్ధం అవుతోందన్నారు మంత్రి ఆర్కే రోజా.. మేం ఏదైతే ఇన్ని రోజులుగా చెబుతూ వస్తున్నామో.. భువనేశ్వరి తన మనసులో మాటను ఈరోజు బయటపెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు వయసొచ్చింది.. రెస్ట్ తీసుకునే సమయం ఆసన్నమైందన్న ఆమె.. భువనేశ్వరి తన కోరికను చంద్రబాబుకు ఈ విధంగా తెలియజేశారని చెప్పుకొచ్చారు. ఇక, మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపించారు.. కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాడు… కుప్పాన్ని అభివృద్ధి చేసింది సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే అన్నారు మంత్రి ఆర్కే రోజా.

Read Also: Indian 2 : ‘ఇండియన్ 2 ‘తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న బడా నిర్మాతలు..

కాగా, చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి.. కుప్పంలో తనకు మద్దతిస్తారా? చంద్రబాబుకు మద్దతిస్తారా? అంటూ అక్కడున్న వారిని ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లుగా కుప్పం ప్రజలు గెలిపిస్తున్నారని.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దామంటూ ఆమె వ్యాఖ్యానించారు.. ఇదే క్రమంలో తనను గెలిపిస్తారా? అంటూ సరదాగా చమత్కరించారు భువనేశ్వరి.. ఓ జోక్ వేస్తున్నా. మీ ఆన్సర్లన్నీ ఫ్రీగా ఇవ్వాలి.. కుప్పం వచ్చిన తర్వాత నా మనసులో ఓ కోరిక కలిగింది.. చంద్రబాబుపై నమ్మకంతో 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు.. అయితే, ఇక్కడికి వచ్చాక నాకో కోరిక కలిగింది. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి, నేను పోటీ చేద్దామని అనుకుంటున్నా.. మీరు ఎవరికి మద్దతిస్తారు.. నేను కావాలో.. చంద్రబాబు కావాలో చేతులెత్తి చెప్పండి అంటూ సభలో సరదాగా నారా భువనేశ్వరి మాట్లాడిన విషయం విదితమే.

Exit mobile version