Site icon NTV Telugu

Vemula Prashanth Reddy: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ

Gruha Lakshmi

Gruha Lakshmi

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ పథకానికి సంబంధించి ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మీ పథకానికి ఎలాంటి గడువు లేదని మంత్రి స్పష్టం చేశారు. గృహలక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ అని.. దరఖాస్తు గడువు విషయంలో విపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

SIIMA 2023: సీనియర్ నరేష్ తో రానా, సుమంత్ పోటీ.. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎవరు?

ఇళ్లు లేని నిరుపేదలు ఖాళీ స్థలం వున్న ఎవరైనా సరే గృహలక్ష్మీ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నంబర్ ఉన్నా, ఖాళీ స్థలం ఉన్నా సరే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చని చెప్పారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3 వేల ఇళ్ల కేటాయింపులు వుంటాయని.. మిగిలిన వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

Kerala New Name: కేరళ ఇకపై కేరళం.. అసెంబ్లీలో తీర్మానం

గృహలక్ష్మీ పథకం కింద సొంత స్థలం వున్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షలు కేటాయిస్తుంది. దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. అయితే తొలి విడతలో భాగంగా దరఖాస్తుకు ఈ నెల 10 వరకే గడువు ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి స్పందించారు.

Exit mobile version