తెలంగాణలో 13 రోజుల పాటు కులగణన రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కూడా ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రెండో విడత కుల గణనకు తక్కువ స్పందన వచ్చిందని తెలిపారు. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు అనే వాళ్లకు సమాధానమని పేర్కొన్నారు. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ళ కోసం అవకాశం ఇచ్చామని మంత్రి చెప్పారు. బీసీ మేధావులు, సంఘాలు కోరిక మేరకు మళ్ళీ అవకాశం ఇచ్చామన్నారు. బీజేపీకి కుల గణన మీద మాట్లాడే హక్కే లేదు.. సుప్రీం కోర్టులో బీసీ కుల గణనకు వ్యతిరేకం అని అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
Read Also: Hit and Run Case: నార్సింగి పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు..
మరోవైపు.. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లకు పోస్టులో దరఖాస్తు ఫారం పంపినా దరఖాస్తు చేసుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వాళ్ళు జనాభా లెక్కల్లో లేనట్టే.. సర్వేలో పాల్గొనని వాళ్లకు మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు. సాయంత్రం వరకు సర్వే పూర్తి వివరాలు వస్తాయన్నారు. కొందరు అధికారులు ఇండ్లలోకి రానివ్వలేదు.. వారిపై కుక్కలు కూడా వదిలారు.. వీడియోలు బయట పెడతామని పేర్కొన్నారు. బీజేపీ పొత్తున్న ఏపీలో కూడా మైనార్టీ రిజర్వేషన్ అమలులో ఉంది.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. త్వరలోనే 42 శాతం రిజర్వేషన్ చట్టం.. కేంద్రంలో బాధ్యత తీసుకుని బీజేపీ నేతలు సహకరించాలని తెలిపారు. 18 జిల్లాలో వంద శాతం సర్వే పూర్తి అయిందని.. సర్వేని తప్పు పట్టిన వాళ్ళు కూడా సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. నమోదు చేసుకొని వారు జనాభా లెక్కల్లో లేరు.. వాళ్లకు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: Home Minister Anitha: రెడ్బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరు..