Ponnam Prabhakar: ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
- ఐటీసీ కాకతీయ హోటల్లో ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని వెల్లడి.
- బలహీన వర్గాల బిడ్డగా బీసీ సంఘాల దగ్గరకు రావడానికి నేను సిద్ధమని వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీసీ కాకతీయ హోటల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ఈ విధానం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా.. నగరంలోని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని, ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు.
Also Read: Prithviraj Sukumaran: మేము విజయం సాధించాం అనడానికి ఇదే నిదర్శనం : పుధ్వీరాజ్ సుకుమారన్
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్ ఎలక్ట్రిక్ బస్సును మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడం, రాష్ట్రంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న కొత్త చర్యలు చూపిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంకా, రవాణా శాఖకి సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని.. ఈవీ బస్సుల వినియోగం పెరిగితే, భవిష్యత్తులో మరిన్ని రకాల ఈవీ బస్సులు ప్రవేశపెట్టాలని అన్నారు. బలహీన వర్గాల బిడ్డగా బీసీ సంఘాల దగ్గరకు రావడానికి నేను సిద్ధమని, అందుకు రోడ్ మ్యాప్ ఇవ్వండని తెలిపారు. పార్టీ ఆలోచన.. అధికారుల పని తీరు మాకు తెలుసునని, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండని అన్నారు. కుల గణన మొదటి సారి చేసింది. దానికి న్యాయం జరగడానికి ఉపయోగించుకుందాం అని అన్నారు. అటు బలహీన వర్గాల ప్రస్తావనలో మంత్రి మాట్లాడుతూ, ఆయన ఎప్పుడైనా బీసీ సంఘాల నేతలతో సమావేశం చేసుకుని, వారికి న్యాయం అందించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. మా ఆలోచన, బలహీన వర్గాలకు న్యాయంచేయడమే అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!