NTV Telugu Site icon

Minister Ponnam Prabhakar: కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar: కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. కేటీఆర్‌కు పదవి పోయిందనే అసహనం ఎక్కువ ఉందన్నారు. ఎవరెన్ని చెప్పినా ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు. గతంలో విదేశీ విద్య చదివే విద్యార్థులకు ఏటా 150 మంది కే ఇచ్చే వాళ్లు అని.. ఇప్పుడు 500 మంది విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం అని గుర్తించినందుకు కేటీఆర్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్స్(ట్విట్టర్) వేదికగా.. అశోక్‌నగర్‌లోని యువత ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ.5 లక్షల యువ వికాసం సహాయం, పునరుద్ధరణకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. మీ హామీ నెరవేరినందున యువతను కలవడానికి హైదరాబాద్‌కు స్వాగతం అంటూ విమర్శనాత్మకగా కేటీఆర్ పోస్ట్ పెట్టారు. గతంలో హైదరాబాద్‌లోని అశోక్‌ నగర్‌లో పర్యటించిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్‌ అన్నారు. బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా?.. అంటూ మరో పోస్టు వేశారు. “నాడు కేసీఆర్‌తో సాధ్యం నేడు అసాధ్యం-పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం.. జ్యోతిబా పులే విదేశి విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది.ముగుస్తున్న కోర్సులు-అప్పుల్లో తల్లిదండ్రులు-సాగదీస్తున్న అధికారులు. దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం? వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్..తక్షణం జాబితా ప్రకటించి ఉపకార వేతనం రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం” అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

Show comments