నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీకి చెందిన ఐదుగురు మంత్రుల పర్యటన కొనసాగుతోంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్, సవిత, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. పేదలకు మంత్రి శుభవార్త పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. 2 లక్షల 30 వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పారు.
READ MORE: Anam Ramanarayana Reddy : ఆ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకొచ్చిన పలువురు మంత్రులు..
“టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. 63 కాలనీల్లో కూడా ఆలయాలను నిర్మిస్తాం. ఎన్నో దేశాలు తిరిగి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా టిడ్కో ఇళ్ల ను తీసుకువచ్చాం. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. 2 లక్షల 30 వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తాం. ఖజానా ను జగన్ ఖాళీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా జగన్ మళ్లించారు. 2019 లో 5 వేల 350 కోట్ల మేర నిధులను ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులను కేటాయిస్తే దానికి మాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కేంద్రంతో చర్చించి ఆ నిధులను తీసుకు వస్తాం. అమృత్ పథకం కింద తాగునీటికి నిధులు ఇస్తాం.” అని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.
READ MORE: Prashant Bhushan: ‘‘ఆప్ పతనం ప్రారంభమైంది..’’ ఒకప్పటి కేజ్రీవాల్ సన్నిహితుడు..