Site icon NTV Telugu

Minister Ponguleti: రైతులకు గుడ్‌ న్యూస్..రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ప్రకటన

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Minister Ponguleti Srinivas Reddy: రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయారని చెప్పారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని.. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మద్దతు ధర ఇవ్వడంతో పాటు తేమ 12 శాతం ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని అన్నారు. రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు.

Read Also: Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం

ఇప్పటికే 18వేల కోట్ల రుణమాఫీ చేశామన్న ఆయన.. రుణమాఫీపై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయన్నారు. అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైనా రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు దీపావళి కానుకగా ఇవ్వబోతున్నామన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టించారో ఇప్పుడు కూడా అలాగే ఇస్తామన్నారు. వరికి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాము, ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకుపోవాలన్నారు. సీసీఐ నామ్స్ ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలన్నారు. ఒక్క కేజీ తరుగు తీయొద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎక్కడ నష్టం కలుగకుండా చూడాలన్నారు. రైతుల అవసరం, కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

Exit mobile version