Minister Ponguleti: పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ & గృహ నిర్మాణ సంస్థ ఎండీ విజయేంద్ర బోయి, గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
RSS: వివాదాస్పద మత స్థలాలను హిందువులకు అప్పగించండి.. ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు..
Also Read
- IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖాయం చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి మూడు లేదా నాలుగు నమూనాలతో ప్లాన్లు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థను పునరుద్ధరణ చేస్తూ.. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి ఇంకను అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై కూడా తీసుకోనే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయవలసిందిగా సంబంధిత సెక్రటరీని మంత్రి ఆదేశించారు.
Congress: రాహుల్ గాంధీ బాటలో ప్రధాని మోడీ.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..
ఈ బృహత్ కార్యక్రమానికి అవసరం అయిన నిధుల సమీకరణ కొరకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని.. అందుకు తగినట్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మంత్రి పొంగులేటి ఆదేశించారు. టెండర్లు ఖరారు చేసి నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయుటకు అవసరం అయిన నిధుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు.. రాజీవ్ స్వగృహ ద్వారా అభివృద్ధి చేయబడిన ఆస్తుల గురించి మంత్రి ఆరా తీశారు. విక్రయించబడని ఆస్తులను తగిన ధరలతో మార్కెట్ చేయడానికి, విక్రయించడానికి వృత్తిపరమైన బృందాలను నియమించాలని ఆదేశించారు. కాగా.. సెమీఫినిష్డ్ టౌన్‌షిప్‌లను సరి అయిన ధరలకు కేబినెట్లో చర్చించి విక్రయించేందుకు తగిన నిర్ణయం తీసుకోనున్నారు. అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం పేదల ఇందిరమ్మ హౌసింగ్ కోసం ఉపయోగించబడుతుంది. అందుకోసం.. గృహ నిర్మాణ మండలి ఆస్తుల సమగ్ర వివరాలు సిద్దం చేయాలని మంత్రి కోరారు
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!