విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కనకదుర్గనగర్ లో మూడు ఇండోర్ సబ్ స్టేషనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. 20 కోట్ల రూపాయలతో మూడు ఇండోర్ సబ్ స్టేషన్లను ప్రభుత్వం నిర్మించింది. 8 సబ్ స్టేషన్లకు లోడ్ రిలీఫ్ ఉంటుంది.. స్ధానిక ప్రజలకు కొండ చివరి వరకూ విద్యుత్ అందించారు.
Read Also: Keeda Cola : కీడా కోలా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం సహజం.. పురంధేశ్వరి టీడీపీకి గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తోంది.. దానిని అందరూ గర్హిస్తున్నారు.. ఈ రాష్ట్రంలో డీస్టీలరీలు అన్నీ చంద్రబాబు మంజూరు చేశారు.. చంద్రబాబుతోనే మద్యం గురించి ఆవిడ మాట్లాడాలి అని ఆయన మండిపడ్డారు. మా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆమెను వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు.. చంద్రబాబు ఆమె తరఫున మాట్లాడితే మాకు ఇబ్బంది లేదు.. వాస్తవాలు తెలుసుకుని పురంధేశ్వరి మాట్లాడాలి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Dharmana Krishna Das: రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగనే
42 కోట్ల రూపాయలతో తూర్పు నియోజకవర్గంలో విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికలలోపు మిగిలిన అన్ని కార్యక్రమాలు చేస్తాం.. తూర్పులో దేవినేని అవినాష్ ను గెలిపించాలి.. నినాదాలు పక్కన పెట్టి దేవినేని అవినాష్ ను ఆశీర్వదించాలి అని ఆయన సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వైసీపీ పార్టీ వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి 175కి 175 స్థానాల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.