NTV Telugu Site icon

Minister Peddireddy Ramachandra Reddy: ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..

Peddireddy

Peddireddy

Minister Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలిసే వస్తాయి.. అప్పుడే ఎన్నికలకు వెళ్తామన్నారు. వైసీపీ బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని ఆయన చెప్పారు. చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని.. అందుకే వేరే రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వేరే పార్టీల అండ కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గురించి తానేం మాట్లాడనని ఈ సందర్భంగా చెప్పారు.

Read Also: IIT Madras: దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. వరసగా ఐదో ఏడాది ఫస్ట్ ర్యాంక్..

ఇదిలా ఉండగా.. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి ఏటీబీ మిషన్ లాంఛ్ చేశారు. ఏటీబీ మిషనులో రూ. 10 నాణెం వేస్తే బ్యాగ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించామన్నారు. టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గించామన్నారు. సముద్ర, నదీ తీరాల్లో, చెరువులు, కాల్వల్లో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆయన పేర్కొ్న్నారు. రూ. 13 లక్షల కోట్ల ఎంఓయూల్లో మెజార్టీ ఎంఓయూలు కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి సంబంధించే వచ్చాయని మంత్రి చెప్పారు. 160 అర్బన్ ప్రాంతాల్లో నగర వనాలు ఏర్పాటు చేశామన్న మంత్రి.. అడవుల విస్తీర్ణానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Show comments