NTV Telugu Site icon

Minister Payyavula: కల్తీ నెయ్యి నిజం, అపచారం జరిగిందనేది నిజం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Minister Payyavula Keshav

Minister Payyavula Keshav

Minister Payyavula Keshav: తిరుమల వ్యవహరం జగన్‌కు ఓ పొలిటికల్ ఈవెంట్ అని.. కానీ మాకు ఇది సెంటిమెంట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ చేసిన పాపాలు ఇక చాలు అంటూ వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి నిజం.. లడ్డూల్లో వినియోగించింది నిజమని.. అపచారం జరిగిందనేది నిజమని ఆయన తెలిపారు. గతంలో ఉన్న లడ్డు నాణ్యతకు.. ఇప్పుడున్న లడ్డు నాణ్యత ఏంటని భక్తులని అడగండి.. వాస్తవాలు తేలుతాయన్నారు.

పాలకుడు మారాడు.. అందుకే తిరుమలలో నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశమున్నా.. చంద్రబాబు మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారన్నారు. వెంకన్న మీద జగనుకు నమ్మకం ఉన్నది నిజమైతే డిక్లరేషన్ మీద సంతకం చేయాలన్నారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నది చాలన్నారు. కమిటీ వేయడం మాత్రమే సీఎం చేస్తాడు.. టీటీడీ పరిపాలనతో సీఎంకు సంబంధం లేదని జగన్ చెబుతున్నారన్నారు.

Read Also: Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..

జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. టెండర్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలను సడలించాలని జగన్ ఒత్తిడి తీసుకు రాలేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. వైసీపీ హయాంలోని ఓ బోర్డు మెంబర్ నెయ్యి వ్యవహరంపై అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు చెబుతున్నారన్నారు. తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందని నార్త్ ఇండియన్ మెంబర్ లేవనెత్తితే నాటి ఈవో ధర్మారెడ్డి, భూమన బుల్డోజ్ చేశారని విమర్శించారు. వెంకన్న సన్నిధిలో దోపిడీ చేస్తే శిక్ష తప్పదన్నారు. శిక్ష పడిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. దోపిడీ సొమ్ము అక్కడే ఉంటుంది.. కానీ దానిని అనుభవించ లేని అనారోగ్యం పరిస్థితుల్లోకి వెళ్తారన్నారు. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి మాకేం అవసరమన్నారు.