Minister Parthasarathi Alleges: ఢిల్లీ లో జరిగిన స్కామ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని.. ఢిల్లీ కన్నా పది రెట్లు ఎక్కువ స్కామ్ ఏపీలో జరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళితే.. గత ప్రభుత్వం మాత్రం లిక్కర్‌లో 98 శాతం నగదు లావాదేవీలు జరిపిందన్నారు. ప్రజల నుంచి ఎందుకు నగదు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నగదు డంప్‌లు దొరుకుతున్నాయని.. ఇది ప్రజలు ఆలోచించాలన్నారు. కల్తీ మద్యం తాగి 35 వేల మంది మృత్యువాత పడ్డారని మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. 30 లక్షల మంది నీ అనారోగ్యం వెంటాడుతోందన్నారు. పోలీసులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నారని.. చట్టాన్ని ఎక్కడ స్వార్థానికి టీడీపీ ప్రభుత్వం ఉపయోగించడం లేదన్నారు. 60, 40% లో డబ్బును ప్రభుత్వానికి జమ చేయకుండా, రియల్ ఎస్టేట్ నిర్మాణరంగం, బంగారం కొనుగోలు చేసేందుకు, చట్టానికి దొరకకుండా సూట్ కేస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా చూపించారన్నారు.
READ MORE: Coolie : నాగార్జునను సూర్యతో పోలుస్తున్న నెటిజన్లు..
వేల కొలది బినామీ ట్రాన్సాక్షన్లు జరిగాయని.. కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను పాటించాలని డిజిటల్ మనీ అమలు చేయాలని చెప్పినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం 99.38 శాతం నగదు రూపంలోనే వినియోగాలు జరిపించిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. “దాని కారణంగానే వేల కోట్ల రూపాయల ఎక్సైజ్ స్కాం జరిగింది. ముందుగా పథకం ప్రకారమే ఎన్నికల్లో మద్యం డబ్బును ఉపయోగించేందుకు నగదు రూపంలో లావాదేవీలకు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతించింది. గత ప్రభుత్వంలో విషపూరితమైన మద్యం కారణంగా మరణాల సంభవించినట్లు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. విలువైన ప్రాణాలు మద్యం ద్వారా గాలిలో కలిసిపోయాయి. ఎన్నో కుటుంబాలు ఈరోజుకీ పలు ఇబ్బందులు అనుభవిస్తున్నాయి. ప్రత్యక్షంగా 35,000 మంది పరోక్షంగా 35 లక్షల మంది కుటుంబాలు మౌనరోధన అనుభవిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నూతన మద్యం పాలసీ ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: OG Firestorm: మనల్ని ఎవర్రా ఆపేది.. రికార్డులు బద్దలు కొడుతున్న OG ‘ఫైర్‌స్టోర్మ్’ సాంగ్!
