ఢిల్లీ లో జరిగిన స్కామ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని.. ఢిల్లీ కన్నా పది రెట్లు ఎక్కువ స్కామ్ ఏపీలో జరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళితే.. గత ప్రభుత్వం మాత్రం లిక్కర్‌లో 98 శాతం నగదు లావాదేవీలు జరిపిందన్నారు. ప్రజల నుంచి ఎందుకు నగదు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.