NTV Telugu Site icon

Minister Niranjan Reddy: నా గెలుపు నాది కాదు శ్రమజీవులు, రైతన్నలు, ప్రజల గెలుపు

Niranjan Reddy

Niranjan Reddy

వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి, మణిగిళ్ల, మోజర్ల, మదిగట్ల, అమ్మపల్లి, ఆల్వాల, చిన్న మందడి, దొడగుంట పల్లి, అంకాయ పల్లి తండా గ్రామాల్లో మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, నాయకుడు నాగం తిరుపతి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదిగట్ల గ్రామంలో బీజేపీ పార్టీ నుండి 10 మంది నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ మాట్లాడుతూ.. సాగునీళ్లు తెచ్చి బతుకు దెరువుకు బాటలు వేశాను.. నేను మాట్లాడే ప్రతి మాట, ప్రతి పని రేపటి భవిష్యత్తు, బతుకు దెరువు కోసమేనని అన్నారు. కాలువలు తవ్వించి నియోజకవర్గానికి సాగునీళ్లు తీసుకుని వచ్చానని తెలిపారు. రేపటి భవిష్యత్తు మొత్తం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంటుంది.. ముందు చూపుతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కేసీఆర్ నన్ను.. వ్యవసాయ శాఖ మంత్రిని చేయడంతో కష్టపడి పనిచేసి వ్యవసాయానికి వన్నె తెచ్చాను .. వనపర్తి పేరును నిలబెట్టానని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Israel-Hamas War: రెండో విడతగా 14 మంది బందీలను విడుదల చేయనున్న హమాస్..

రైతుల కోసమని సీఎం కేసీఆర్.. 24 గంటలు ఉచిత కరెంట్ ను ఇస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో దొంగలు ఉండే.. కరెంట్ ఎప్పుడు వస్తుందో అని రైతులు పాటలు పాడుకునేవాళ్లు.. కాంగ్రెస్ వాళ్లు వాళ్ల హయాంలో రైతులకు ప్రజలకు కరెంట్ కష్టాలు మాత్రమే ఇచ్చారు, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ వస్తే రాష్ట్రం పరిస్థితి, ప్రజల జీవితాల పరిస్థితి ఆగం అవుతుందని మంత్రి అన్నారు. ఇదిలా ఉంటే.. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ రైతు బీమా తరహాలో వాళ్లకు కేసీఆర్ భీమాను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కష్ట కాలం తప్ప ఒరిగేది ఏమి లేదని ఆరోపించారు. సాగునీళ్లు ఇవ్వడం వల్ల రాష్టంలో 2.5 కోట్ల మందికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఉపాధి దొరుకుతుందని అన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో.. 24 వేల ఉద్యోగాలు ఇచ్చారు. అదే బీఆర్ఎస్ 9 ఏండ్ల కాలంలో 1లక్ష 62 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వాళ్ల హయాంలో 3.30 లక్షల మందికి కంప్యూటర్ ఉద్యోగాలు.. మన ప్రభుత్వం హయాంలో 6.30 లక్షల కంప్యూటర్ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో గెలిచేది మనమే.. వచ్చేది మన ప్రభుత్వమే.. మన పనులు మనం చేసుకుంటామని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో రైతుబందు వేస్తే కేసీఆర్ కు ఓట్లు పడుతాయి అని కాంగ్రెస్ వాళ్లు లెటర్లు పెట్టారు. ఎన్నికలకు రైతు బంధుకు సంబంధం లేదని.. రైతులకు ఇబ్బందులు అవుతాయాని వివరణలు పెడితే స్పందించిన ఈసీ రైతుబంధును వేయడానికి అనుమతులు వచ్చాయన్నారు.

Priyanka Gandhi: మీరు వేసే ఓటే.. 5 సంవత్సరాల అభివృద్ధిపై అధారపడి ఉంటుంది

ఏమవుతుందని 23 ఏండ్ల కింద తెలంగాణ జెండా పట్టుకుని తిరిగినాని.. తాను ఎమ్మెల్యే, మంత్రిని అయితా అని జెండా పట్టలేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల కష్టాలను చూసి జెండా పట్టుకుని తిరిగానని.. అందరి సహకారంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. నేను గెలిస్తే మీరు గెలిచినట్లే.. ఓటు వేసే ముందు ఒకసారి మీరే ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి.. అందరు అలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నిక అని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి ముందుకు సాగడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. 56 సంవత్సరాలు ఆంధ్ర పాలనను చూసినాం.. 9 ఏండ్ల నుండి కృష్ణనది నీటి వాటా తేలలేదు. ఈ విషయం పై కేంద్రం ఇంత వరకు ఏమి మాట్లాడలేదు.. కాంగ్రెస్ వాళ్లు కూడా ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు. మన బీఆర్ఎస్ ఎంపీ లు మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడు సంవత్సరాలల్లో పూర్తి అయ్యేది.. కానీ పని జరుగకుండా 1000 కోట్ల జరిమానాతో కోర్టులో కేసు వేశారు.. అయినా మొండిగా పని చేసి 7.5 సంవత్సరాలలో పాలమూర్ రంగారెడ్డి పనులు పూర్తి చేశామన్నారు. 1కోటి 10 లక్షల ఎకరాల్లో యాసంగి, రబి సీజన్ లో వరి పంటను పండిస్తూ దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చామని తెలిపారు.

Manchu Manoj: ఆస్తి గొడవలు.. మంచు బ్రదర్స్ మధ్య మాటలు లేవు..?

గతంలో తినడానికి తిండి లేక పొట్ట చేతబట్టుకుని వలసలు వెళ్లేవాళ్లమని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. స్వరాష్ట్ర పాలన ఏర్పడిన తరువాత వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతో చాలా వరకు వలసలు తగ్గి ఉన్నంత భూమిలో వ్యవసాయం చేసుకుంటు ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. మన ఆలోచన తీరు ఒకటి వాళ్ల ఆలోచన తీరు వేరు… కాంగ్రెస్ జాతీయ పార్టీ వాళ్లకు ఆంధ్రా, తెలంగాణ కావాలి కాబట్టి నీటి వాటా పంచాయతీ తెంపదన్నారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పథకాలు, కొనుగోలు కేంద్రాలు, గ్రామాలను బాగు చేసినందుకా.. సీఎం కేసీఆర్ బాగాలేడని వాళ్లు ఉన్న రాష్టాల్లో అమలు చేయరని ఆరోపించారు. కానీ ఇన్ని చేస్తున్న ప్రభుత్వం వద్దు అని కాంగ్రెస్ కు ఓటు వేయమని అడుక్కుకుంటున్నారని చెప్పారు. వాళ్ళను 50 ఏండ్లు చూసినం, కేసీఆర్ ను రెండు సార్లు చూసినం ఒక సారి వాళ్ళను చూద్దాం అనుకుంటే మాత్రం 5 ఏండ్లు చూడడానికి ఏమి ఉండదని విమర్శించారు. ఈ రోజు అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, వసతులు గతంలో ఉండేనా అని ఆలోచించుకోవాలని అన్నారు. రైతులు అప్పుల పాలు కావద్దు అని తెలంగాణ ప్రభుత్వం అలోచించి రైతుబంధు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం రైతులు అప్పులపాలు కావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.