Site icon NTV Telugu

Minister Narayana: ఒక్కరోజులోనే 99 శాతం పెన్షన్ల పంపిణీ..!

Minister Narayana

Minister Narayana

Minister Narayana: ఒక్కరోజులోనే 99 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేస్తున్నాం అని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ.. నెల్లూరులోని 4వ డివిజన్ దీనదయాళ్ నగర్ లో పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరిగిగంది.. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఒకటో తేదీ పండుగలా పెన్షన్ ల పంపిణీ సాగుతోంది.. ఒక్కరోజులోనే 99 శాతం పంపిణీ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ లు ఇంటి దగ్గర ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందిపెట్టింది.. కానీ, విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతో పెన్షన్ ల ప్రక్రియ గాడిలో పడిందన్నారు.. రాష్ట్రంలో 67 లక్షల మందికి తెల్లవారి నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మొదలయిందన్నారు.. 34 వేల కోట్ల రూపాయలను ఏడాదికి పెన్షన్ లకు ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం అని వెల్లడించారు.. ఇక, నెల్లూరు జిల్లాలో మూడు లక్షలా నలభై వేల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు.. 130 కోట్ల రూపాయాలు పెన్షన్ దారులకు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు.. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా మాటప్రకారం 4 వేల పెన్షన్ అరియర్స్ తో కలిపి ఇచ్చామని గుర్తుచేశారు మంత్రి పొంగూరు నారాయణ..

Read Also: SCO Summit: ట్రెండింగ్‌గా మారిన ఐదు ఫొటోలు.. ఏవేవంటే..!

Exit mobile version