Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్
- తిరుపతి జిల్లాలో మరొక కీలకమైన ప్రాజెక్టు..
- శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఏర్పాటు..
- నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్..
- 5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు.. 2 వేల మందికి ఉద్యోగావకాశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మరొక కీలకమైన ప్రాజెక్టు వచ్చి చేరింది.. ఈ రోజు శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారా లోకేష్… 5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.. శ్రీసిటీలో ఎల్జీ గృహోపకరణాలు తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ఉద్యోగావకాశాలతో పాటు.. 839 కోట్ల రూపాయలతో మరో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు..
Read Also: AP Cabinet: భూ కేటాయింపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్.. యుద్ధ వాతావరణంపై చర్చ!
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఈ రోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ కీలక ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక దిగ్గజం ఎజీ సంస్థ ప్లాంట్ ఏర్పాటుకు తిరుపతి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీసిటీ వేదిక కానున్నది. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆ ప్లాంట్ కు పలురకాల రాయితీలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి దశలో 188 ఎకరాలను కేటాయించింది. 1500 మందికి ప్రత్యక్షంగా, మరో అయిదారు వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది.. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది. నూతన పారిశ్రామిక విధానం 4.0 కింద ప్రకటించిన రాయితీలకు ప్రతిస్పందించిన ఎల్జీ యాజమాన్యం గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి లాంఛనంగా ఒప్పందం కుదుర్చుకుంది. తరువాత దశలో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలో దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ బహుళ ఉత్పత్తుల వాణిజ్య నగరంగా పేరొందిన శ్రీ సిటీ పారిశ్రామిక వాడ ను ఎల్ జి సంస్థ ఎంపిక చేసుకుంది.
Read Also: Jammu Kashmir: ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు.. కీలక వస్తువులు స్వాధీనం!
రూ 5,001 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన ఎల్జీ ప్లాంట్ కోసం దాదాపు 250 ఎకరాల స్థలం కావాలని ఆ సంస్థ యాజమాన్యం కోరింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వ సతుల కల్పనా సంస్థ (ఏపిఐఐసి) ద్వారా శ్రీ సిటీ 2వ విస్తరణ పరిధిలోని కొల్లడం గ్రామ సమీపంలో తొలిదశలో 188 ఎకరాల స్థలాన్ని కేటాయించినా మలిదశలో మరో 70 ఎకరాల దాకా కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాక 20 ఏళ్లపాటు వంద శాతం రాయితీతో నీటి సరఫరా చేయడానికి, పలు మినహాయింపులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించడానికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. మరో రెండేళ్లలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.. ఈ రోజు ఉదయం కంపెనీ కి సంబందించిన భూమి పూజా, శంకుస్థాపన చేయానున్నారు లోకేష్. దానికి సంబంధించిన పనులు పూర్తిచేశారు జిల్లా అధికారులు… తిరుపతి జిల్లాకు కీలకమైన ప్రాజెక్టు వస్తున్న తరుణంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు..
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!