NTV Telugu Site icon

Nara Lokesh: రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం..

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం పనితీరు, ర్యాంకింగ్ మెరుగుదల, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటుచేయాలి, ఎకోసిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ తదితర 16 రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించే ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఏఐ టెక్నాలజీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్ పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని అన్నారు. దీని ద్వారా విద్యార్థుల అటెండెన్స్‌తో పాటు వారి తెలివితేటలను అంచనా వేసి, మెరుగు పర్చడానికి ఆస్కారమేర్పడుతుందని తెలిపారు.

Read Also: Deputy CM Pawan Kalyan: కేబినెట్ భేటీలో కీలక సూచనలు చేసిన పవన్‌ కళ్యాణ్‌

ఈ ఏడాది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున వచ్చే ఏడాదినుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలుచేయాలని ఆదేశించారు. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సమీక్షిస్తూ మెరుగైన ఫలితాల సాధనకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ఏర్పాటైన హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ మానిటరింగ్ కమిషన్ చేపడుతున్న చర్యలపై చర్చించారు. అకడమిక్ ఎక్సెలెన్స్ , ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ పై దృష్టిసారించి, ర్యాంకింగ్ మెరుగుదలకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ర్యాంకింగ్స్ విషయంలో ఆంధ్రా యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, జెఎన్ టియు (కాకినాడ) మాత్రమే సంతృప్తికర పనితీరు కనబరుస్తున్నాయని అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. యూనివర్సిటీల్లో పరిశోధనలు పెరగాల్సి ఉందని, పరిశ్రమ అనుసంధానిత ఇంటర్న్ షిప్, అప్రెంటీస్ షిప్ లు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్థులు కులధృవీకరణ పత్రాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. యూనివర్సిటీల్లో విసీల నియామక ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Read Also: MP Appalanaidu: చేనేత దినోత్సవం.. ప్రధానికి టీడీపీ ఎంపీ అపురూప కానుక

ఆర్జేయూకేటీలను రాజకీయాలకు అతీతంగా విద్యారంగనిపుణులతో మెరుగ్గా తీర్చిదిద్దుతాతమని తెలిపారు. సమర్థవంతమైన నిర్వహణ కోసం నిపుణులతో ఎక్స్‌పర్ట్ కమిటీ నియామకం, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా సమీకృత సేవలు అందించడం, అప్రెంటీస్ ఎంబడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ పనితీరు తదితర అంశాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నతవిద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌చార్జి ఛైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, స్కిల్ డెవలప్‌మెంట్ వీసీ అండ్ ఎండీ గణేష్ కుమార్ పాల్గొన్నారు.

Show comments