ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం పనితీరు, ర్యాంకింగ్ మెరుగుదల, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి కాలేజియేట్, టెక్నికల్, ఇంటర్మీడియట్ విద్యా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు/ పాలిటెక్నిక్‌లు/లో పనిచేస్తున్న టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగులకు బదిలీ మార్గదర్శకాలు వర్తిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GORt. నం. 118) తెలిపింది. ప్రతి కొత్త జిల్లాలు/జోన్/మల్టీ జోన్ కోసం ఆన్‌లైన్ వెబ్…