NTV Telugu Site icon

Minister Nara Lokesh: పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయండి..

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh: పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దాలన్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. మెగా డీఎస్సీ నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువమంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ఈనెల 11వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు.

Read Also: Nara Brahmani: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా బ్రాహ్మణి

పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుపర్చే చర్యల్లో భాగంగా తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ డిసెంబర్ మొదటివారంలో మెగా పేటీఎం నిర్వహించాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తిచేయాలన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అపార్ ఐడీ కార్యక్రమం ఇప్పటివరకు 57.48శాతం పూర్తి అయిందన్నారు. సాధ్యమైనంత త్వరగా అపార్ ఐడీ ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ రిపోర్టు కార్డులు అందజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ ర్యాంకింగ్స్ పై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. అటెండెన్స్ మెరుగుదలకు చర్య తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలుండాలన్నారు. రాష్ట్రం మొత్తాన్ని నాలుగు జోన్లుగా విభజించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏడాదికల్లా మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పాస్ పర్సంటేజి మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. అవసరమైతే వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించాలన్నారు. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలను ఏఐ ద్వారా ఎవాల్యుయేషన్ చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి తెలిపారు.

Read Also: Andhra Pradesh: దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి పెట్టాలన్నారు. ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలన్నారు. రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసే వారికి త్వరితగతిన అనుమతులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఐఐటీ, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలను దినపత్రికల్లో ప్రచురించేలా కసరత్తు చేయాలన్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం వల్ల 15వేల వరకు అడ్మిషన్లు పెరిగాయన్నారు. వచ్చే ఏడాది 2 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. విద్యార్థుల హాజరుపై సమీక్ష, ప్రోగెస్ కార్డులను అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉత్తమ అధ్యాపకులతో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులకు శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్ తో పాటు ప్రశ్నాపత్రంలోనూ మార్పులు జరగాలన్నారు.

Show comments