NTV Telugu Site icon

Nadendla Manohar: రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే నిత్యవసర సరకులు

Nadendla Manohar

Nadendla Manohar

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేష‌న్ కార్డు దారుల‌కు స‌బ్సిడీపై కందిప‌ప్పు, పంచ‌దార పంపిణీ చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి ప‌ట్టణంలో మంగ‌ళ‌వారం మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ చేతుల మీదుగా ప్రారంభించారు. స‌బ్సిడీపై కార్డు దారుల‌కు కిలో కందిప‌ప్పు, అర‌కిలో చ‌క్కెర ను మంత్రి మనోహర్ పంపిణీ చేశారు.

READ MORE: Kakani Govardhan Reddy: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఈ సంద‌ర్భంగా మంత్రి మ‌నోహ‌ర్ మాట్లాడుతూ.. ఈ నెల నుంచి ఒక్కొక్క కార్డు దారునికి 67 రూపాయ‌ల‌కే కిలో కందిపప్పు, 17 రూపాయలకే అరకేజీ చక్కెర పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని, బ‌హిరంగ మార్కెట్లో నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెరిగిపోతుండ‌గా వాటిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న మేర‌కు ఈ నిర్ణయం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4 కోట్ల 30 ల‌క్షల మందికి ల‌బ్ధి చేకూరుతుంద‌ని చెప్పారు. అలాగే జ‌న‌వ‌రి నుంచి రేష‌న్ కార్డుల ద్వారా రాగులు , ఇతర మిల్లెట్స్ కూడా అందించ‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు. గ‌త ప్రభుత్వం బ‌స్తాల్లో రేష‌న్ షాపుల‌కు కందిప‌ప్పు, పంచ‌దార పంపించేదన్నారు. ఇప్పుడు జీఎస్టీ అద‌న‌పు భార‌మైన‌ప్పటికీ ప్యాకింగ్ చేసి నాణ్యమైన వాటిని అందిస్తున్నామని తెలిపారు.

Show comments