Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మంత్రి మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మహాత్ముడి జయంతిన దీక్ష చేస్తాడట.. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర ఉద్యమం మీద అవగాహన ఉంటే ఇలాంటి పనులు చేయడంటూ మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ విమర్శించారు. మహాత్ముడి జయంతిని వాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆయన అన్నారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన దొంగ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. న్యాయస్థానాలే జైలుకి పంపిన వ్యక్తి ఇవాళ దీక్ష చేయటం నీతిబాహ్యమైన పని అంటూ పేర్కొన్నారు.
Also Read: Mahatma Gandhi: భారతీయ కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
ఇంట్లో వాళ్ళను కూడా బయటకు తీసుకుని రాజకీయం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. బ్రాహ్మణి, భువనేశ్వరి.. మీ పార్టీ నాయకుడు ఒక మహిళా మంత్రిపై నీచంగా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించటం లేదని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడని.. అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేకపోయాడని ఆయన అన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతున్నాడని మంత్రి నాగార్జున ఆరోపణలు చేశారు.