మన భారతీయ కరెన్సీ పై గాంధీ ఫొటోస్ ఉండటం చూస్తున్నాం.. కానీ ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు ఉండగా, ఆయన ఫోటోలను పెట్టడానికి అసలు కారణాలు చాలామందికి తెలియదు.. దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఆ స్టోరీ ఏంటో ఈరోజు గాంధీ జయంతి సందర్బంగా వివరంగా తెలుసుకుందాం..
ప్రపంచంలోని వివిధ దేశాల నోట్లపై ఆయా దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల చిత్రాలు ముద్రించబడతాయి. అమెరికాలోని ప్రతి నోట్‌పై వేర్వేరు అధ్యక్షులు, ఇతర వ్యక్తుల చిత్రాలు ఉంటాయి. బ్రిటన్‌లో రాజు చిత్రం ఉంటుంది. అదే సమయంలో.. భారతదేశంలో ప్రతి కరెన్సీ నోటుపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. అయితే మహాత్మా గాంధీ కంటే ముందు భారతదేశం కరెన్సీ నోట్ల పై అశోక చక్రం ఉండేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆర్బీఐ తర్వాత గాంధీ బొమ్మను ముద్రించారు..
1969లో మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన నోటును విడుదల చేసింది. ఇందులో సేవాగ్రామ్ ఆశ్రమం ముందు గాంధీజీ కూర్చొని ఉన్న ఫోటోని నోట్ల పై ముద్రించారు.. మన కరెన్సీ నోటుపై 1987లో మొట్టమొదటిగా నవ్వుతున్న జాతిపిత చిత్రం ముద్రించబడింది. అదే ఏడాదిలో అక్టోబర్‌లో రూ.500 నోటును ముద్రించారు. అందులో గాంధీ చిరునవ్వుతో కూడిన చిత్రం కనిపించింది. దీని తరువాత అప్పటి నుంచి ఇప్పటివరకు అదే నోట్లను ముద్రిస్తున్నారు.. ఇంకో విషయం ఏంటంటే.. నోటుపై గాంధీ గారికన్నా ముందు బ్రిటన్ రాజు జార్జ్ VI చిత్రం ఉంది. స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ రాజు బొమ్మ స్థానంలో గాంధీ బొమ్మని ముద్రించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ అది జరగడానికి చాలా సమయం పట్టింది.. అలా ఇప్పుడు గాంధీ బొమ్మను నోట్ల పై ముద్రిస్తున్నారు.. ఒక లెజెండ్ పర్సన్ అనే చెప్పాలి.. స్వాతంత్య్రం రావడానికి మూల కారణం గాంధీజీ.. ఈరోజు ఆయన జయంతి సందర్బంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుందాం..