Site icon NTV Telugu

Mandipalli Ramprasad Reddy: రెవెన్యూ అధికారుల పనితీరుపై మండిపడ్డ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Mandipalli Ramprasad Reddy

Mandipalli Ramprasad Reddy

అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది.. ముఖ్యంగా రెవిన్యూలో ఎవరు చేయలేనిది ఓన్లీ రెవిన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు.. ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు.. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా.. మంత్రిగా కాదు.. జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో జేసీ, కలెక్టర్ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయాలి.. ఆ మీటింగ్ కు వీఆర్వోలు అందరిని పిలిపించాలి..

Also Read:Gorantla Madhav: గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. 12 మంది పోలీసులపై చర్యలు

వీఆర్వోల వ్యవస్థ ఎలా తయారయ్యింది అంటే పల్లెల్లో ఎవరైతే మంచి కాఫీ తాపుతారో, నాటుకోడి చికెన్ పెడతారో వాళ్లకే పనులు జరుగుతున్నాయి.. మిగిలిన వారిని వీఆర్వోలు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా.. ఆయన కూడా స్పందించారు.. త్వరలో అన్నమయ్య జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు ఎమ్మెల్యేలు, టిడిపి ఇన్చార్జులు మీటింగ్ ఏర్పాటు చేస్తారు.. ఈ మీటింగ్ కు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ హాజరయ్యేలా చూడాలి.. చాలామంది రైతుల్లో నిరుత్సాహం ఉంది..

Also Read:SRH vs PBKS: అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరి విధ్వంసం.. పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం

ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ కార్యక్రమాలు జరుగుతాయో జరగవో గానీ.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వంలో జరిగిన దురాఘాతాలన్నీ బయటపెట్టి రెవిన్యూ పరంగా మంచి చేస్తామని ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాం.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ గౌరవాన్ని కాపాడేందుకు రెవిన్యూ సిస్టం బాగా పనిచేయాలి.. రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ల మనుగడ సాధించాలంటే రికార్డులన్నీ సక్రమంగా ఉండాలి.. ఆ రికార్డులన్నీ గత 5 సంవత్సరాల్లో తార్ మార్ చేశారు.. వీటన్నిటిని చక్కదిద్దేందుకు పై స్థాయి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Exit mobile version