Site icon NTV Telugu

Minister Nara Lokesh: వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..అందేంటో తెలుసా?

Narachandrababu

Narachandrababu

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పదేళ్ల క్రితం 2015 అక్టోబరు 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాలోకేష్ మాట్లాడారు. పహల్గాం దాడిలో అమరులైన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేదిక మీద నుంచి పాకిస్థానీయులను హెచ్చరించారు.

READ MORE: Amaravati Relaunch: ప్రధాని మోడీకి శాలువా కప్పి ప్రత్యేక జ్ఞాపికను అందజేసిన సీఎం చంద్రబాబు!

“ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకి దేశం మొత్తం అండగా నిలుస్తుంది. పాకిస్థాన్ గీత దాటింది. అమాయకులను చంపింది. చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్థాన్ కాదు.. 100 పాకిస్తాన్ లో వచ్చినా.. భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేదు. 100 పాకిస్థాన్ లకు సమాధానం చెప్పే.. ఒక్క మిస్సైల్ మన దగ్గర ఉంది. ఆ మిస్సైలే “నమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ”. సింహం ముందు ఆటలాడకూడదు. ఆడితే ఏమవుతుందో అందరికీ తెలుసు. మన ప్రధాని మోడీ కొట్టే దెబ్బకి ప్రపంచ మ్యాప్ లోనే పాకిస్థాన్ కనుమరుగైపోతుంది. ఈరోజు పాకిస్థాన్ ఆర్మీ లో పని చేసే వాళ్ళు కొంత మంది రాజీనామా చేశారు. కొంతమంది సెలవు పెట్టి పోయారు. అది మన మోడీ పవర్ అంటే.. మన ప్రధాని దిబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయం.” అని మంత్రి నారాలోకేష్ వ్యాఖ్యానించారు.

READ MORE: Odysse Evoqis: 4.32 kWh బ్యాటరీ, 3000W మోటార్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ బైక్ కేవలం రూ. 1.18 లక్షలకే లాంచ్..!

Exit mobile version