తెలంగాణ అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీ భట్టవిక్రమార్క మాట్లాడుతూ.. నాకు పత్రికలు, మీడియా నుంచి సమాచారం ఉంది. ఏకగ్రీవం అయిన జీపీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి సర్పంచ్ లకు నిధులు రాక, చేసిన పనులకు బిల్లులు రాక చెప్పులు అరిగెల తిరుగుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో.. తన నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ ఆనంద్ ఆరోగ్యం బాగాలేక చనిపోయారని ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. సభను భట్టి తప్పు దోవ పట్టిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. పాదయాత్ర చేసి భట్టి అలసిపోయారని, మీ బాధ అర్థం చేసుకుంటామన్నారు. మీరు ఇక్కడ కూర్చుంటే గాంధీ భవన్ లో మీ వెనుక గోతులు తొవ్వు తున్నారని, భట్టి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయడం లేదని ఒకసారి, నిధులు ఇవ్వడం లేదని మరోసారి, అన్నింటికీ భూములు ఇస్తున్నారని ఒకసారి చెప్తున్నారన్నారు.
Also Read : Botsa Satyanarayana: చంద్రబాబు వల్లే పుంగనూర్ లో గొడవ జరిగింది..
మీ పార్టీలో క్లారిటీ లేదు.. మీకు క్లారిటీ లేదు : భట్టి కామెంట్స్ పై కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజల్లో లేని అసమ్మతిని చెప్పే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు… ప్రతిపక్ష పార్టీలకు లెక్కలు రావు అన్నట్లు ఉందని, ఒక వేలు మమ్మల్ని చుపిడితే.. నాలుగు వేళ్ళు ప్రతిపక్ష పార్టీలను చూపిస్తాయన్నారు. ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు అని, పదిమంది సీఎంలమని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎక్స్పైర్ అయిన మందు కాంగ్రెస్ అని, కాంగ్రెస్ విశ్వసనీయత పోయిందన్నారు మంత్రి కేటీఆర్. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, మూడు నెలల్లో జరిగే ఎన్నికల కోసమే ప్రతిపక్షాలు ఆలోచిస్తే.. కేసీఆర్ రాబోయే వందేళ్ల కోసం ఆలోచిస్తున్నారన్నారు. మాకు కట్టడం మాత్రమే తెలుసు.. ప్రతిపక్షాలకు కులగొట్టడం మాత్రం తెలుసు అని, రాష్ట్ర బడ్జెట్ అంటే ప్రజల జీవనాడీ అని ఆయన అన్నారు.
Also Read : MLC Kavitha : మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం
