NTV Telugu Site icon

Minister KTR : సిద్దిపేటలో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేదా.. వచ్చేదా

Minister Ktr Speech

Minister Ktr Speech

సిద్దిపేటలో మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేటను చూసి అసూయపడేలా మంత్రి హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నారన్నారు.

Also Read : OTT Releases: ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే!

తెలంగాణ మోడల్ అంటే సమగ్ర సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు పంచాయతీ అవార్డులు.. మరోవైపు పట్టణ ప్రగతి అవార్డులు జాతీయ స్థాయిలో మనకు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. చాలా మంది సిద్దిపేట మీద ప్రత్యేక ప్రేమ ఎందుకు అని అడుగుతున్నారని, ఉద్యమ నాయకుణ్ణి అందించిన జిల్లా సిద్ధిపేట గడ్డ అని ఆయన అన్నారు. సిద్దిపేట లో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేదా..వచ్చేదా అని ఆయన వ్యాఖ్యానించారు. నేను సిరిసిల్ల కి వెళ్ళేటప్పుడు సిద్దిపేట కి వచ్చినప్పుడు మా బావకి ఫోన్ చేసి మళ్ళీ కొత్తది ఏం కట్టినవ్ అని అడుతానని, అలా సిద్దిపేటని అభివృద్ధి చేస్తున్నాడు హరీష్‌ రావు అని ఆయన అభినందించారు.

Also Read : Pawan Kalyan: వారి తిట్లకు చేతలతో సమాధానం చెప్తా.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

సిద్దిపేట స్పూర్తితో ప్రతి జిల్లాలో స్వచ్ఛబడి ఏర్పాటు చేస్తామన్నారు. 1980లో సిద్దిపేట అభివృద్ధి మొదలైందని, దళిత బంధు కొత్త పథకం అని అంటున్నారు… సిద్దిపేటలో ఆనాడే దళిత చైతన్య జ్యోతి అని కేసీఆర్ పెట్టారన్నారు. మిషన్ భగీరథకు పునాది పడ్డది కూడా సిద్దిపేటలోనేనని, మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టిందన్నారు. హరీష్ రావు నాకు బావ కాబట్టి అప్పుడప్పుడు ఎడిపిస్తానని, ప్రతి నియోజకవర్గం సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తామన్నారు. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని మేమందరం పని చేస్తామన్నారు. ఈ సారి హరీష్ రావుని లక్ష 50 వేల మెజార్టీ తో గెలిపించాలన్నారు మంత్రి కేటీఆర్.