KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి పేర్కొన్నారు. ఒక్క దురదృష్టకర సంఘటనను బూచిగా చూపి మొత్తం నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ కుతంత్రమని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు.. ప్రభుత్వం వేరు అన్న ఇంగిత జ్ఞానం లేని అజ్ఞానులంటూ మండిపడ్డారు. వెకిలి మకిలి ఆరోపణలతో బట్టగాల్చి మీదేసే చిల్లర ప్రయత్నాలను సహించేది లేదన్నారు. మతిలేని మాటలు మాట్లాడుతున్న పిచ్చి నేతల రాజకీయ ఉచ్చులో యువత చిక్కుకోవద్దన్నారు. ఉద్యోగాల ప్రిపరేషన్‌ను కొనసాగించాలని యువతకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Read Also: Parliament Impasse: లోక్ సభ స్పీకర్‌తో ప్రధాని మోదీ భేటీ.. రాహుల్ అంశంపై చర్చ?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేయగా.. రేపటి సిట్ విచారణకు సంజయ్ హాజరు కావడంలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. తనకు సిట్ నోటీసులు అందలేదని స్పష్టం చేసిన బండి సంజయ్.. సిట్‌పై నమ్మకం లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల వల్ల ప్రస్తుతం ఢిల్లీలోనే బండి సంజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపటి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్ అధికారులకు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. విచారణ అనంతరం మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్షాలను ప్రభుత్వం విచారణల పేరుతో భయపెడుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని విమర్శించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!