NTV Telugu Site icon

KTR : కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్‌

Minister Ktr

Minister Ktr

KTR : తెలంగాణ సర్కార్ అభివృద్ధే ప్రధానంగా దూసుకుపోతుంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు విశ్వనగరం హైదరాబాదులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నేడు రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ దాదాపు 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656 (200 మిలియన్‌ డాలర్లు) కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ కొంగర కలాన్ లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. భూమి పూజ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌లియూతో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

Read Also: MLA Nallapareddy: పవన్ తన శీలాన్ని చంద్రబాబు అమ్మేశాడు..! నువ్వు ప్యాకేజీ స్టార్ వే

కంపెనీ ప్రారంభమైతే ఇందులో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రపంచంలో సుమారు 70 శాతం యాపిల్‌ ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌ కంపెనీయే తయారు చేస్తున్నది. యాపిల్‌ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్‌ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. యాపిల్‌ కంపెనీ ఎయిర్‌పాడ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది. ఇప్పటివరకూ మొబైల్‌ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్‌కాన్‌, ఇప్పుడు ఎయిర్‌పాడ్‌ల తయారీలోకి అడుగు పెడుతోంది. ఇటీవలే ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌లూ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారన్న సంగతి తెలిసిందే.

Read Also: Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి.. పలువురికి అస్వస్థత