NTV Telugu Site icon

Minister KTR : తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ

Minister Ktr

Minister Ktr

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అని, కార్యకర్తల భరోసా కోసం అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా.. పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆస్తులు అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారన్నారు. ఈ కార్యాలయం కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా కార్యక్రమాలు చేయాలని జిల్లా పార్టీ నాయకత్వానికి సూచించారు మంత్రి కేటీఆర్‌. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాలను నిర్మిస్తామని, ఎన్నికలు 5 ఏళ్లకో సారి వస్తయ్.పోతాయ్.. 50 ఏళ్లలో రైతు బంధు వంటి కార్యక్రమాలు రూపొందించింది కేసీఆర్‌ మాత్రమేనని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు.

Also Read : Komatireddy Venkat Reddy : వేముల వీరేశం రాకతో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది

కేసీఆర్ పథకాలను కాంగ్రెస్, బీజేపీలు కాపీ కొడుతున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. కేసీఆర్ ను తిడితే ఓట్లు రావు అని గుర్తు పెట్టుకోవాలని చురకలంటిచారు కేటీఆర్‌. రాష్ట్రంలో రెండు సార్లు రుణ మాఫీ చేశామని, కేసీఆర్‌ మాటిస్తే చేస్తాడని.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తామన్నారు. 93 లక్షల తెల్లకార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా అందిస్తామన్నారు. రేషన్ కార్డుపై సన్నబియ్యం అందిస్తామని, ఆడబిడ్డలు సిలిండర్ కు దండం పెట్టి బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సౌభాగ్య లక్ష్మి పేరుతో మహిళలకు భరోసా కల్పిస్తామని, కేసీఆర్ ఆరోగ్య రక్ష అమలు చేస్తాం.. మేనిఫెస్టో భగవద్గీత లాంటిదన్నారు. 45 రోజులు పని చేసి 5 ఏళ్లు మాతో పని చేయించుకోండన్నారు. కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ సీఎం అయ్యేలా పనిచేయాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

Also Read : Gun Firing: అహోబిలంలో నాటు తుపాకీ కాల్పుల కలకలం