హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో స్కైవాక్ బ్రిడ్జిని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మొట్టమొదటి స్కై వాక్ బ్రిడ్జి ఉప్పల్ లో ప్రారంభించామని తెలిపారు. 4, 5 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు త్వరలో ఇస్తామని, నారపల్లి-ఉప్పల్ బ్రిడ్జి నిర్మాణం కేంద్రం ఆలస్యం చేస్తోందన్నారు. 35 ఫ్లై ఓవర్లు, అండర్ వేలు తొమ్మిదేళ్ళలో నిర్మాణం పూర్తి చేసామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ‘ఉప్పల్, అంబర్ పేట ఫ్లై ఓవర్లు బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. మోడీ – కేసీఆర్ పాలనకు ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణాలే నిదర్శనం. నాలుగేళ్ళ నుంచి ప్రజలను కేంద్ర ప్రభుత్వం చావగొడుతున్నారు. ఉప్పల్ లోని ఐదు పారిశ్రామికవాడలు ఉండేవి. వాటికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము. నాడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. 10 డివిజన్లలో మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మించాలి.
Also Read : CWC Qualifiers: స్టన్నింగ్ విక్టరీ కొట్టిన జింబాబ్వే.. సీన్ విలియమ్స్ ఊచకోత
ప్రజల గురించి ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదు. నడ్డా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను ఎందుకు జైలుకు పంపుతావ్.. 13 లక్షల మంది ఆడ పిల్లలు కేసీఆర్ కిట్ ఇస్తున్నందుకు అరెస్ట్ చేస్తావా? కేసీఆర్ ను తిట్టి పైచాకిక ఆనందాన్ని పొందుతున్నారు. కేసీఆర్ వయస్సు 70 ఏళ్ళు. ఆయన ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నడ్డా కానీ, తీన్ ఫుట్ గాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదు. 55 ఏళ్లలో చేయలేని పని బిఆర్ ఎస్ తొమ్మిదేళ్లలో చేసాం.ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. కేసీఆర్ – బీజేపీ, కేసీఆర్ – కాంగ్రెస్ తో కలిసిపోయారని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధి గురించి మాట్లాడాలి. 55 ఏళ్లలో కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఏమి చేసింది? అమరవీరుల ను చంపింది ఎవరు? సోనియాగాంధీ వల్లే కదా పొరగాళ్ళు చనిపోయింది. చంపినోడే సంతాప సభ పెట్టినట్లు రేవంత్ మాటలు ఉన్నాయి. అవినీతి గురించి రేవంత్ చెప్పడం హాస్యాస్పదం. 50 లక్షల తో దొరికిన దొంగ రేవంత్. ఢిల్లీ గులాములతో ఏమి కాదు.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.