వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా భావిస్తున్న కేసిఆర్ పాలన కావాలా? రాబందుల్లా పీక్కుతినే పార్టీలు కావాలా? అని ఆయన అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తే సంబరాలు చేసుకుంటే తప్పా అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Famous Foods: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టాప్-10 వంటకాలు
అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకుంటే మీకేం నొప్పి. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉంది. గతంలో ఐటి మంత్రిగా పని చేసిన వ్యక్తి ఒక్క ఐటి కంపెనీ అయిన వరంగల్ కు తీసుకు వచ్చాడా? ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన పార్టీ కి తగిన గుణపాఠం చెప్పాలి. బీజేపీకి ఏది చేతకాదు. మత పిచ్చి, కులపిచ్చితో కలహాలు సృష్టించడమే బీజేపీకి తెలుసు.
Off The Record : తెలంగాణలో లెఫ్ట్ పార్టీల తదుపరి అడుగులు ఎటుపడబోతున్నాయి.?
కేంద్ర ప్రభుత్వం దివాలా కోరు ఆర్థిక విధానాలతో ఆగం చేస్తుంది. బీజేపీకి తిరుగులేని విధంగా వరంగల్ నుంచి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు రాబందుల్లా పీక్కుతిన్నారు. కాంగ్రెస్ నేతలు పెద్ద పెద్ద మాటలు ఇష్టం వచ్చినట్లు చెబుతున్నారు. 55 ఏళ్ల పాటు కరెంటు, మంచినీళ్లు ఇవ్వని నాయకులు కాంగ్రెస్ పార్టీ చెందిన వారు. తెలంగాణాలో అతిపెద్ద ఆసుపత్రి 24 అంతస్థులతో వరంగల్ లో నిర్మిస్తున్నాం. వచ్చే దసరా నాటికి ప్రారంభించే దిశగా పనులు జరుగుతున్నాయి. అధునాతనమైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ జోర్దార్ మీటింగ్ పెట్టిండు. కేసీఆర్ ఆశీస్సులు ఉంటే మీ ఆశీర్వాదం ఉంటే నరేందర్ మళ్లీ ఎమ్మెల్యేగా తిరిగి వస్తాడు.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.