Site icon NTV Telugu

Minister KTR : జరిగిన పొరపాట్లను సవరించుకుంటూ ముందుకు పోతాం

Ktr

Ktr

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబ‌ర్‌పేట‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగ‌తి నివేద‌న స‌భ‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలు ప్రతి పక్ష పార్టీలు చేస్తాయని, హనుమంతుని గుడి లేని ఊరు లేదు …కేసీఆర్ సంక్షేమ పతకాలు తీసుకొని ఊరు లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తె భూముల ధరలు పడిపోతాయి అన్నారని, కొంగర్కలన్ లో ఫాక్స్కన్ పరిశ్రమ వస్తుంది… దాని వలన లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గృహ లక్ష్మి కింద మహిళల పేరు మీద మూడు లక్షలు ఇస్తామని, మనం మంచి పనులు చేస్తుంటే కొందరు బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు.

Also Read : Bhatti Vikaramarka : దేశ సంపదను ప్రధాని మోడీ క్రోనీ క్యాపిటలిస్ట్‌లకు దోచిపెడుతున్నారు

ఇక్కడ ఒక నాయకుడు కోతులు పట్టుకుని ఫోటో దిగిండని, ప్రతి పక్షంలోనే కోతుల సమస్య ఎక్కువగా ఉందన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజల చుట్టు తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు… ఇన్నేళ్ళు అధికారం ఇస్తే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోడీ అధికారం లోకి వస్తె పంద్రా లాక్ ఇస్తా అన్నడు మరి అవి ఏమయ్యాయీ.. తాను అధికారం లోకి వస్తె సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. రాష్ట్ర బీజేపీ నాయకులు నిరుద్యోగ మార్చ్ చేస్తా అన్నారు… మీరు ఉద్యోగాలు ఇవ్వని మి మోడీ ఇంటి ముందు చేయండి. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కల సంస్థ.. పేపర్ లీక్ అయింది అని తెలిసిన వెంటనే రద్దు చేసాము. జరిగిన పొరపాట్లను సవరించుకుంటూ ముందుకు పోతాము.. నియామక ప్రక్రియను ఆపే కుట్ర జరుగుతోంది. మీరు వారి ఉచ్చులో పడకుండా బాగా చదవండి. కుట్రలు పన్నే వారి సంగతి మేము చూసుకుంటామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Also Read : Women’s World Boxing Championship: స్వర్ణం గెలిచిన నీతూ.. ఆరో మహిళగా రికార్డు

Exit mobile version