Site icon NTV Telugu

Ktr : మోడీ మహా నటుడు.. రేవంత్ కు అంతలేదు.. కేటీఆర్

Ktr

Ktr

మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు.. 10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు పాలించి ఎం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం చెందారు.

Also Read : Salman Khan: ఆ సమయంలో సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు.. గ్యాంగ్‌స్టర్ బిష్ణోవ్ బాంబ్

భారతదేశంలోనే అబద్ధాలు చెప్పడం.. నటించడంతో ప్రధానమంత్రి మోడీ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని తెలంగాణ మున్సిపాల్ శాఖ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
మహా నటుడు మోడీ.. దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమచేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడని విమర్శలు గుప్పించాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. నల్లధం తెస్తానని ఇపుడు తెల్లమొఖం వేశాడని ప్రధాని నరేంద్ర మోడీపై ఐటీమంత్రి కేటీఆర్ విమర్శాలు గుప్పించాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలి.. తెలంగాణ పై కేంద్రం కక్ష గట్టిందని ఆయన తెలిపారు.

Also Read : Student Suicide: మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థిని ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో ఘటన

తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని భారతీయ జనతాపార్టీ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మోడీ ఈడీలకు భయపడది లేదని ఆయన విమర్శానాస్త్రాలు సంధించారు. దమ్ముంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం అంటూ కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను కాపాడుకుని.. ముచ్చటగా మూడో సారి సీఎం చేసుకుందాం అని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బిచ్కుంద, పిట్లం మండలాలను మున్సిపాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version