వికారాబాద్ జిల్లా పరిగిలో మంత్రి కేటీఆర్ కుల్కచర్ల మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ కేసీఆర్ ధీమా పేరుతో భీమా ఇస్తామన్నారు. సౌబాగ్య లక్ష్మీ ద్వారా అర్హులైన ప్రతి మహిళకు 3 వేల రూపాయలు.. ప్రతి ఇంటికి సన్న బియ్యం.. ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు.. కేజీ టు పీజీ విద్య ఇస్తాం.. ప్రతి ఇంట్లో కేసీఆర్ పథకం అందుతుంది.. రైతు బంధు ద్వారా 73 లక్షల రైతులకు సాయం.. 5లక్షల రైతు భీమా..1043 తాండాలను ఈ ప్రాంతంలో గ్రామ పంచాతీలను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Also: Akkineni Naga Chaitanya: అన్ని అయిపోయాయి.. ఇక దీని మీదనే ఆశలన్నీ.. ఏం చేస్తావో ఏమో.. ?
గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళ సంఘాలకు మహిళా భవనాలు ఏర్పాటు చేస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కరెంటు కావాలంటే బతుములాడే పరిస్థితి.. కాలిపోయే మోటర్లు,పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ లు ఉండే.. తాగునీరు లేదు, సాగునీరు లేదు.. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడ్డందుకు ఈ ప్రాంతానికి వచ్చే నీళ్ళు రాలే.. నీళ్ళు రాలేవు అనే ఈ ప్రాంత హవుల గాడు.. బస్సు పెడతాం రా.. నీళ్ళు చూపిస్తాం (కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్స్) అని ఆయన అన్నారు. సంవత్సరంలోపు పాలమూరు-రంగారెడ్డి పూర్తవ్వగానే కుల్కచర్లకే మొదట నీళ్ళు వస్తాయి అని కేటీఆర్ అన్నారు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో భక్తులు, పూజారిపై ముస్లింలు దాడి.. కారణమేంటంటే..?
55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెసోళ్ళు గుడ్డీ గుర్రాల పండ్లు తోమారు అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 ఏళ్ళ పాలనలో జరగనిది ఈ కాంగ్రెసు వాళ్ళు ఎలా చేస్తారు.. గుజరాత్ ,కర్ణాటక, డిల్లీ నుండి కేసీఆర్ గొంతు పిసికేందుకు బయలుదేరిండ్రు.. సింహం సింగిల్ గా వస్తది.. గుంపులు గుంపులు గా వచ్చేవి ఏంటో మీకే తెలుసు.. ఆరు గ్యారెంటీ అంటే ఆరు నెలలకు ఒక సిఎం మారడం అని ఆయన వ్యాఖ్యనించారు. పోటి చేయనోళ్ళు కూడా సిఎం పదవికోసం చూస్తున్నారు.. రేవంత్ రెడ్డి కాదు.. రేటేంత రెడ్డి అన్ని సీట్లు అమ్ముకున్నాడు.. మన రాష్ట్రాన్ని దొంగల చేతిలో పెడదామా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులు చెంపలేసుకుంటున్నారు
Read Also: Revanth Comments: పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చారు..?
కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా.. ఈ ప్రాంత రైతులు ఆలోచించాలి అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వందలు.. కేసీఆర్ ప్రభుత్వంలో 2000.. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే 4 వేలు ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే ముదిరాజ్ సోదరులకు మంచి శుభవార్త చెప్పబోతున్నాం.. అభివృద్ధి మా కులం, సంక్షేమం మా మతం.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కూడా ఈడీ రైడ్స్ జరిగినాయ్.. మరి వాళ్ళను అరెస్ట్ చేయలే.. మరి మా కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్ట్ చేయాలే అని ఆయన ప్రశ్నించారు. కులాలు, మతాలు, ప్రాంతాలు మనకొద్దు.. అభివృద్ధి కావాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలే.. రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలంటే డిల్లీ పెద్దలు నిర్ణయించాలే.. మహేష్ రెడ్డిని గెలిపించండి.. గండీడు వికారాబాద్ జిల్లాలో కలుపుతాం.. కుల్కచర్లలో జూనియర్ కాలేజీ.. పరిగిలో ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు.