NTV Telugu Site icon

KTR: రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతాడు

Ktr

Ktr

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా.. అసైన్డ్ భూములు ఉన్నవాళ్లకు హక్కులు కల్పిస్తామన్నారు.

CM YS Jagan: సీఎం జగన్‌ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ నేతలు

కేసీఆర్ కు తెలివి లేదు.. 3ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు అనవసరంగా కరెంట్ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడని మంత్రి కేటీఆర్ చెప్పారు. రైతుల వద్ద 10HP మోటర్ ఉంటదా అని ప్రశ్నించారు.? కరెంట్ వస్తుందా, లేనే లేదు ఎక్కడ వస్తుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి అని తెలిపారు. మక్తల్ గడ్డ నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా… కాంగ్రెస్ నేతల కోసం పెడతాం.. బస్సు ఎక్కి మక్తల్ లో ఎక్కడికైన వెళ్లి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకొండి.. రాష్ట్రానికి ఓ దరిద్రం పోతుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటున్నారు.. ఆకలికేకలు, గంజి కేంద్రాలు, ఎరువుల కోసం లాఠీఛార్జ్ లు, నక్సలైట్ల పేరు చెప్పి కాల్పులా? అని ప్రశ్నించారు.

Suriya: సెట్ లో ప్రమాదం.. తన ఆరోగ్య పరిస్థితి చెప్పిన సూర్య..

కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉంటే… కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే… కాంగ్రెస్ ఉండద అని అన్నారు. ధరణిలో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు.. ధరణి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూస్తున్నారు కదా అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ కు 11 ఛాన్స్ లు ఇచ్చాం.. ఏం చేశారని అన్నారు. ఇక.. సోషల్ మీడియా అయితే అస్సలు నమ్మకండని చెప్పారు. స్వయంగా కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓడిపోతాడని మంత్రి కేటీఆర్ అన్నారు.

Show comments