NTV Telugu Site icon

Minister KTR : సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తాం

Ktr

Ktr

రాష్ట్రంలో జరుగుతున్న మోసాలతో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దృష్టి సారించే దిశగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. నేడు మంత్రి కేటీఆర్‌ సైబర్ సేఫ్టీ కోసం తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జాబితాను తయారి చేసి వారికి ఎక్కడ జాబ్ రాకుండా చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితాలో ఉంచాలని, ఆ నిందితులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకూడదన్నారు. పోలీసు శాఖలో డ్రోన్ విధానం వీలైనంత త్వరలో అమలు చేయాలని ఆయన సూచించారు. పోలీసులు సంఘటనా స్థలంలోకి వెళ్లే లోపే డ్రోన్ ద్వారా దృశ్యాలు సేకరించాలని, ఐటీ పరిశ్రమ తరఫున పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Also Read : Unstoppable 2: ‘ఆహా’… నటరత్నను స్మరించుకున్న ఆ ఐదుగురు!

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, పలు తరహాల్లో మోసాలకు పాల్పడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్‌. సైబర్ నేరాలపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలబారిన పడిన వాళ్లకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందన్నారు. సైబర్ నేరాలకు అరికట్టడానికి తెలంగాణ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా… ఇతర కంపెనీలు సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లోని లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తామన్నారు.

Show comments