NTV Telugu Site icon

Kottu Satyanarayana: కాపులను వాడుకుని వదిలేయలని పవన్‌ చూస్తున్నాడు..

Kottu Fire On Pawan

Kottu Fire On Pawan

Kottu Satyanarayana: వారాహి యాత్ర ప్రారంభించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఇక, అదేస్థాయిలో వైసీపీ నుంచి పవన్‌కు కౌంటర్లు పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ అర్థంపర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. అత్యధిక కాపులు ఉండే ప్రాంతానికి వెళ్లి కాపులను తిట్టడం మంచి పద్ధతి కాదని హితవుపలికిన ఆయన.. పవన్ తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారో.. అతి తెలివి చూపిస్తున్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు.. కాపు రిజర్వేషన్లు ఇస్తామని నువ్వు గానీ, నీ దత్త తండ్రి గానీ చెప్పగలరా..? అంటూ పవన్‌ను నిలదీశారు.

Read Also: MVV Satyanarayana Family: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్

పవన్ కల్యాణ్‌, చంద్రబాబులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. అందుకే గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు మంత్రి కొట్టు.. కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పోరాటం చేస్తే తట్టుకోలేక చంద్రబాబు రైలు తగలబెట్టి.. కేసుల్లో ఇరించారని విమర్శించారు.. కానీ, ఆ విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.. కాపులను వాడుకుని వదిలేయాలని చూడటం, చంద్రబాబుకి కాపులను తాకట్టు పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ చూస్తున్నారంటూ ఆరోపించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాగా, పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని పవన్‌ ఆరోపించిన విషయం విదితమే.. ప్రజల్ని బాగా చూసుకుంటానంటే వైసీపీతో తనకు ఇబ్బంది లేదన్నారు. ఒక్క సీటు కూడా లేని జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే క్లాష్‌వార్ అంటాడని.. ఎప్పుడూ నవ్వుతూ వుంటాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీని నడపటానికే తాను సినిమాలు చేస్తున్నానని పవన్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

Show comments